కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేయూ కాంట్రాక్టు అధ్యాపక సంఘం కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ వర్సిటీ పరిపాలన భవనం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ అసిసెంట్ ప్రొఫెసర్లు అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించినా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డికి సంఘం బాధ్యులు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment