అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
హన్మకొండ అర్బన్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాక డే హాజరైన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్ పనులు, బాలసముద్రం, పోతననగర్‌లోని జీడబ్ల్యూఎంసీ డంపింగ్‌యార్డులు పూర్తిచేయాలని సూచించారు. ప్రధాన రహదారుల విస్తరణకు అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ బస్టాండ్ జంక్షన్ నుంచి కాంగ్రెస్ భవన్ వరకు ఎడమ వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వెడల్పు చేస్తే రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ ఉంటుందని పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పార్కింగ్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. జీడబ్ల్యూఎంసీ, ఆర్టీసీ బస్ స్టేషన్, రిజిస్ట్రేషన్ కార్యాల య ఆవరణలో ఇందిరా మహిళా శక్తి కాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తియినందున పాలిటెక్నిక్ కళాశాలకు శంకుస్థాపన చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని, అసంపూర్తి గృహా ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రావీ ణ్య మాట్లాడుతూ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ట్రాఫి క్ ఏసీపీ భానుకిరణ్, ‘కుడా’ ఈఈ భీంరావు, ఇరిగేషన్ ఈఈ సీతారాంనాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, హౌసింగ్ నోడల్ అధికారి రాజేందర్, తహసీల్దార్లు భావ్‌సింగ్, శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
హన్మకొండ చౌరస్తా: పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తామని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో మంగళవారం కాంగ్రెస్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, అర్హుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమన్నారాయణ, విజయశ్రీరజాలీ, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, బొమ్మతి విక్రమ్, ఏనుగుల రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హనుమకొండ కలెక్టరేట్‌లో
అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment