బైలాస్‌పై అవగాహన అవసరం
వరంగల్: సెర్ప్ ఉద్యోగులు గ్రామ, మండల సమాఖ్యల ఉప విధుల నిబంధనావళి(బైలా)పై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ డీఆర్‌డీఓ కౌసల్యాదేవి సూచించారు. మంగళవారం డీఆర్డీఏ కార్యాలయంలో మండల కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, డీపీఎంలకు నూతన బైలాలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఆర్డీఓ సెర్ప్ ఉద్యోగులకు బైలాలో పొందుపర్చిన నియమ నిబంధనలను అవగాహన కల్పించిన తర్వాతనే వీఓ, మండల ప్రతినిధుల ఈసీ, ఓబీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. సమాఖ్యల ఉపవిధుల నిబంధనావళి ఉల్లంఘిస్తే చట్టపరమైన చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, డీపీఎంలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ డీఆర్‌డీఓ కౌసల్యాదేవి
Comments
Please login to add a commentAdd a comment