పాఠశాలలు సామాజిక దేవాలయాలు
పర్వతగిరి: పాఠశాలలు సామాజిక దేవాలయాలని, పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించి పాఠశాలకు గౌరవాన్ని పెంచాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వందేమాతరం రవీంద్ర సూచించారు. ఈ మేరకు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పాక రమేష్‌బాబు అధ్యక్షతన మంగళవారం పదో తరగతి శత శాతం ప్రాజెక్టులో భాగంగా తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్ష నిర్వహించి 15మంది విద్యార్థులను లిటిల్ టీచర్స్‌గా ఎంపికచేసి వారికి బ్యాడ్జీలు అందజేశారు. అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. లిటిల్ టీచర్స్‌గా ఉన్న విద్యార్థులు తోటి విద్యార్థులకు బోధించి పాఠ్యాంశాలపై ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేస్తూ తమ గ్రూపు విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు అయ్యేలా చూడాలన్నారు. ఎంఈఓ గాదె లింగారెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పరీక్షల ఫలితాలు వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment