పథకాలతో సొమ్ము కాజేసిన బీఆర్‌ఎస్
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
పరకాల: పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, పేదలకు అందించాల్సిన కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల్లో బీఆర్‌ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 148 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.1.48 కోట్ల చెక్కులను, 122 మందికి సీఎంఆర్‌ఎఫ్ 36.55 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే అందుబాటులోకి వంద పడకలు
పరకాలలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరకాలలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే రేవూరి శనివారం పరిశీలించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, కమిషనర్ సుష్మ, కాంగ్రెస్ నాయకులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment