నేడు మొగిలిచెర్లకు డిప్యూటీ సీఎం భట్టి
వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 15వ డివిజన్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం వస్తున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.55 నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్‌లో బస చేసి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)కు చేరుకుంటారు. అక్కడ 3.00 గంటల నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ శంకుస్థాపనపై సంబంధిత అధికారులతో చర్చిస్తారు. 3.30 గంటలకు ఐడీఓసీ నుంచి మొగిలిచెర్లకు వెళ్లి అక్కడ గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, మొగిలిచెర్ల, గొర్రెకుంటలో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకం వేస్తారు. 5.30 గంటలకు మొగిలిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. 5.30 గంటలకు బయల్దేరి రోడ్డు మార్గంలో 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment