షరతుల్లేకుండా రైతు భరోసా ఇవ్వాలి..
మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
శాయంపేట: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతు భరోసా ఇవ్వాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎలాంటి దరఖాస్తులు లేకుండా రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా దరఖాస్తులు చేయాలని కాలయాపాన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మారెపల్లి మోహన్, నాయకులు గంటా శ్యాంసుందర్ రెడ్డి, వల్పదాసి చంద్రమౌళి, దైనంపల్లి సుమన్, మారెపల్లి నందం, అరికిల్ల ప్రసాద్, కొమ్ముల శివ, గాజె రాజేందర్, లక్ష్మారెడ్డి, రమేశ్, సంతోశ్, రాజ్‌మహ్మద్, రాకేశ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment