వాణిజ్య అవసరాలకు వినియోగించే వారికి తప్పనిసరి
90–100 లీటర్లు క్రిటికల్
70–90 లీటర్లు.. సెమీ క్రిటికల్
ఎక్స్‌ట్రాక్షన్
చార్జీలు
(భూమిలో
ఇంకిన 100
లీటర్లలో)
హన్మకొండ: విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలు.. పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం భూగర్భ జలాల వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. తాగునీరు వ్యాపార వస్తువుగా మారిపోయింది. విచ్చల విడిగా బోర్లు వేసి నీటిని తోడుతున్నారు. ఫలితంగా భూగర్భంలో నీరు అడుగంటి వందలాది అడుగుల లోతుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల వెలికితీతను నియంత్రించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వాల్టా చట్టాన్ని అనుసరించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ట్రాక్షన్ రూల్స్–23ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి పన్ను చెల్లించాలి. లైసెన్స్‌తో పాటు జిల్లా భూగర్భ జల శాఖ ద్వారా నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ నిబంధనల అమలులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలాల వెలికితీత నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు.
లైసెన్స్.. నో ఆబ్జ్జక్షన్
సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే..
గృహ, వ్యవసాయ అవసరాలకు మినహాయింపు
నిబంధనల అమలులో జాప్యం
ప్రతీ జిల్లాలో ఏడుగురు
సభ్యులతో విజిలెన్స్ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment