మొక్కలు నాటుతున్న మంత్రి కారుమూరి
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వసుధకు వందనం కార్యక్రమంలో తణుకు 14వ వార్డు పల్లాలమ్మ నగర్‌లో శనివారం ఆయన మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా అమరవీరుల గుర్తుగా ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్కలు భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాయని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ కేటీ సుధాకర్, డీఈఈ కొవ్వూరి ఈశ్వరరెడ్డి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, వైఎస్సార్‌సీపీ వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, దున్నల ఉమామహేశ్వరరావు, బోయిడి అన్నవరం, మల్లుల సత్యనారాయణ, కొఠారు రామాంజనేయులు, కుడుపూడి చంద్రరావు, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment