కొమ్ముగూడెం సొసైటీని ఆదర్శంగా తీసుకోవాలి
తాడేపల్లిగూడెం రూరల్: కొమ్ముగూడెం సొసైటీని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని పీఏసీఎస్‌లలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్.నాగరాణి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కొమ్ముగూడెం సొసైటీ వద్ద సహకార వారోత్సవాల సభ నిర్వహించారు. తొలుత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 24 మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలలో ఇప్పటి వరకు 12 పూర్తి చేసుకుని కార్యకలాపాలను సాగిస్తున్నాయన్నారు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సహకార సంఘాల ద్వారా రూ.36 కోట్ల రుణాలు అందించామని, మరో రూ.15 కోట్ల టర్నోవర్‌తో పది రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. కొమ్ముగూడెం సొసైటీ రూ.4.90 కోట్ల మూలధనంతో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. కొమ్ముగూడెం సొసైటీ కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ఇతర పీఏసీఎస్‌ల సిబ్బందితో విజిట్ చేయించాలన్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఎక్కువగా పామాయిల్, కోకోనట్ పర్రిశమను అభివృద్ధి చేసేందుకు అవకాశాలకు ఆలోచన చేసి మహిళలు, యువతకు అవకాశం కల్పించడం ద్వారా దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్నారు. జిల్లా సహకార అధికారి నాగరాజు, తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనో, జిల్లా రిజిస్ట్రార్ కే.వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈవో సీహెచ్‌ఎస్‌వీ. కృష్ణ శర్మ, తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, సర్పంచ్ తాడేపల్లి బేబి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment