వివిధ హోటళ్లపై కేసుల నమోదు
కార్తీక దీపోత్సవం
కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మంగళవారం శివాలయాలు హర నామస్మరణతో మార్మోగాయి. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా పలు హోటళ్లపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వీ.శ్రీరాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దెందులూరు మండలం, సింగవరంలో నిర్వహిస్తున్న గరుడ ఫుడ్ కోర్ట్‌లో కృత్రిమ రంగులు కలుపుతున్నారని వచ్చిన సమాచారం మేరకు తమ విజిలెన్సు అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆహార పదార్థాల తనిఖీ అధికారులు మంగళవారం తనిఖీ చేయగా నిల్వ ఉంచిన మాంసాహారం గుర్తించారన్నారు. ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు కలిపినట్లుగా వచ్చిన అనుమానంతో నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. గరుడ ఫుడ్ కోర్ట్‌లో లైసెన్స్ లేని రెండు ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు, కేఎఫ్‌సీ ఫుడ్ కోర్ట్‌లో లైసెనన్స్ లేని ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాన్ని గుర్తించి లీగల్ మెట్రాలజీ అధికారి కేసులు నమోదు చేశారన్నారు. పెదపాడు మండలం, కలపర్రు టోల్ గేటు వద్ద నిర్వహిస్తున్న మురుగన్ హోటల్‌లో తనిఖీ చేయగా నిల్వ ఉంచిన మాంసాహారం గుర్తించామని, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు కలిపినట్లుగా వచ్చిన అనుమానంతో నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు. ఈ హోటల్‌లో లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాన్ని గుర్తించి లీగల్ మెట్రాలజీ అధికారి కేసులను నమోదు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment