పంట నియంత్రణ పాటించాలి
జంగారెడ్డిగూడెం/కొయ్యలగూడెం: రైతులు పంట నియంత్రణ పాటించాలని వర్జీనియా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ అన్నారు. జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రంలో మంగళవారం ఆయన రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పొగాకు పండించే దేశాల్లో ఈ ఏడాది పొగాకు అధికంగా ఉత్పత్తయిన కారణంగా రైతులు పంట నియంత్రణ పాటించాలని కోరారు. ప్రస్తుత అంతర్జాతీయ పొగాకు మార్కెట్ పరిస్థితిని వివరించారు. పొగాకు సాగుకు అనువైన నేలలను ఎంపిక చేసుకుని నాణ్యమైన పొగాకు పండించాలని, లో గ్రేడ్ నివారించుకుంటూ ఎన్‌ఎల్‌ఎస్ బ్రాండ్ వాల్యూను కాపాడేలా అధిక నికోటిన్ ఇచ్చే కండ కలిగిన ఆరెంజ్ స్టైల్ పొగాకును పండించేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు బోర్డు నిర్దేశించిన పంట విస్తీర్ణం, పరిమాణానికి కట్టుబడి సాగు చేట్టాలన్నారు. కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో రైతు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment