లేసు పార్కు అభివృద్ధిపై చర్చలు
నరసాపురం రూరల్: లేసు, అల్లిక పనులు చేసే మహిళల ఆర్థికాభివృద్ధి ప్రణాళికలపై నాబార్డు డీడీఎం అనిల్ కాంత్ మార్కెంటింగ్ రుస్తుంబాద లేసుపార్కు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. లేసు పార్కులో లేసు అల్లికల మహిళలకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు డీఆర్డీఏ సహకారంతో గతంలో లేసు పార్కులో మహిళలకు నిర్వహించిన చేతి వృత్తులకు సంబంధించి ఇచ్చిన శిక్షణ, తదితర అంశాలపై చర్చించారు. చేతి వృత్తుల అల్లికలతో పాటు ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఉత్పత్తుల విక్రయాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తామని నాబార్డు అధికారులు డీఆర్డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్‌కు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గతంలో ఇచ్చిన శిక్షణకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకునేందుకు ఎగ్జిమ్ బ్యాంకు సిబ్బంది కూడా లేసుపార్కును సందర్శించి డాక్యుమెంటేషన్ పూర్తి చేసే పనులు చేపట్టారు. లేసు పార్కును సందర్శించిన వారిలో నాబార్డు డీడీఎం(ఏలూరు) టి.అనిల్‌కాంత్, శార్ట్ ఎన్‌జీవో సంస్థ ప్రతినిధి వర ప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, లేసుపార్కు ప్రాజెక్టు మేనేజర్ ఎస్ కుసుమకుమారి తదితరులు ఉన్నారు.
ప్రోత్సాహానికి నాబార్డు హామీ
Comments
Please login to add a commentAdd a comment