మద్యం దుకాణం ఏర్పాటుపై దళితుల ఆందోళన
పాలకోడేరు: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో దళిత వాడకు దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో దళిత వాడకు చెందిన మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రార్ధన మందిరానికి దగ్గరగా, విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా ఉండేలా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ షాపునకు పంచాయతీ ఎలా అనుమతులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్మశాన వాటికకు వెళ్లడానికి వీలు లేకుండా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ మద్యం దుకాణాన్ని జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి ఆశీర్వాదమ్మ, దాసరి పద్మ, కే లక్ష్మి, నామాల దీప్తి, కె.ఉషశ్రీ, ఎన్.సాల్మన్, ఎం.పేతురు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment