ఏలూరు (టూటౌన్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన నిర్వాసితుల ఊసు ఎత్తకపోవడం, వారి గోడు పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి తెలిపారు. మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ.. పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నిర్వాసితుల పరిహారం, పునరావాసంపై మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. సీపీఎం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే నిర్మాణం చేపట్టాలనే విషయం విస్మరించడం సరికాదన్నారు. ప్రాజెక్టు వల్ల ఒక లక్ష కుటుంబాలు నిర్వాసితులయితే ఇంతవరకు కేవలం 10 నుండి 15 శాతం మందికి మాత్రమే పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించారని తెలిపారు. పునరావాస కాలనీల్లో సరైన రోడ్లు, డ్రెయిన్లు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారని చెపఆరు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని, పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment