జగన్ పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు
వీరవాసరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తెలిపారు. వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21న జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని వివరించారు. జగన్ జన్మదిన వేడుకలను వాడవాడలా చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్దమవ్వడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో మాజీ జెడ్పిటిసి మానుకొండ ప్రదీప్ కుమార్, మాజీ మండల కన్వీనర్ గూడూరు ఓంకారం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment