ఏపీఎస్‌టీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్‌టీఏ) జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పీవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పీతల రవికుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా తేలి సంజయ్‌గాంధీ, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రాంబాబు, కోశాధికారిగా పితాని హరిబాబులను ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీజే ప్రభువరం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటలో తమ సంఘం ముందు వరుసలో ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment