రాష్ట్రస్థాయిలో గురుకుల విద్యార్థుల సత్తా
పెదవేగి : రాష్ట్రస్థాయి అండర్ 19 ఎస్‌జీఎఫ్ బేస్‌బాల్ టోర్నమెంట్‌లో పెదవేగి గురుకుల విద్యార్థులు సత్తా చాటి ద్వితీయ స్థానం సాధించారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి విద్యార్థులు 9 మంది పాల్గొనగా నలుగురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వచ్చే నెల 15 నుంచి మహారాష్ట్ర నాందేడ్‌లో జరుగు జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, పీడీ జయరాజు, పీఈటీ గురుమూర్తిని పలువురు అభినందించారు.
దారి తగవు కేసులో ఆరుగురికి జైలు శిక్ష
ఉంగుటూరు: దారి తగవు విషయంలో నమోదైన కేసుకు సంబంధించి ఆరుగురికి తాడేపల్లిగూడెం సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఈ.అన్నామణి జైలు శిక్ష విధించినట్లు గణపవరం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. 2017వ సంవత్సరంలో పెద్ద వెల్లమిల్లి గ్రామంలో దారి తగవు విషయంపై గ్రామానికి చెందిన పిల్లం గోళ్ల భాస్కరరావు ఫిర్యాదు చేశాడు. దీంతో అదే గ్రామానికి చెందిన కుందేటి శ్రీను, కుందేటి వీరరాఘవులు, కుందేటి అబ్బులు, కుందేటి సరస్వతి, కుందేటి నాగమణి, కుందేటి బ్రహ్మయ్య అనే వారిపై అప్పటి ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి అన్నామణి కుందేటి శ్రీను, కుందేటి వీరరాఘవులు, కుందేటి సరస్వతి, కుందేటి నాగమణి, కుందేటి బ్రహ్మయ్యలకు సంవత్సరం మూడు నెలల చొప్పున జైలు, 20 వేలు జరిమానా విధించారు. అలాగే కుందేటి అబ్బులుకు సంవత్సరం ఆరు నెలలు జైలు, 30 వేలు జరిమానా విధించారు. ఈ కేసులో ఏసీసీ అడబాల రవి వాదనలు వినిపించగా, చేబ్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్, కోర్టు కానిస్టేబుల్ బాలిన లక్ష్మీనారాయణ సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment