ప్రాథమిక విద్య కీలకం
అరకొర వైద్యం
భీమవరంలోని ప్రభుత్వాస్పత్రిలో అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. పూర్తిస్థాయిలో వైద్య నిపుణులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. 8లో u
కలెక్టర్ నాగరాణి
ఉండి: ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పటిష్టంగా ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం మండలంలోని పాందువ్వ, ఉండిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని రుచిచూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు వారికి మరింత శ్రద్ధగా విద్యాబోధన చేయాలన్నారు. టెన్త్ విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలన్నారు. నూరు శాతం ఉత్తీర్ణతకు కృషిచేయాలన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను ఆమె పరిశీలించారు. పాందువ్వలో డ్రెయినేజీ సమస్యపై స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పాందువ్వలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరయ్యారు. రైతుల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, తహసీల్దార్ కె.నాగార్జున, ఎంపీడీఓ ఎస్.రవీంద్ర, ఎంపీటీసీ సాగిరాజు సుజాత పాల్గొన్నారు.
గోకులం షెడ్లపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): గోకులం పశువుల షెడ్ల నిర్మాణాల లక్ష్యంలో వెనుకబడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, అంగన్‌వాడీ పిల్లలకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, మిస్సింగ్ హౌస్ డేటా ఎన్‌రోల్‌మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్‌పీసీఐ నమోదు అంశాలపై ఆమె సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment