రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు!
హేతుబద్ధంగా విలువల పెంపు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సర్వే నంబర్ల వారీగా పరిశీలించి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో ఆయన సమీక్షించారు. జిల్లాలోని అన్ని వార్డులు, బ్లాకులు, సర్వే నంబర్ల వారీగా పరిశీలన చేయాలన్నారు. ఈసీ డేటా తీసుకొని నిర్ధారించాలన్నారు. కొత్తగా వచ్చిన డోర్ నంబర్లు సేకరించాలన్నారు. సరిహద్దు గ్రామాల మధ్య సర్వే నంబర్లు వేర్వేరుగా ఉంటే ఒకేలా విలువకు తీసుకురావాలన్నారు. ప్రజల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఇతర నివాస స్థలాలను వేర్వేరుగా గుర్తించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఎన్.మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఎల్.వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ ఎం.పార్వతి, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాడేపల్లిగూడెంలోని యాగర్ల పల్లిలో చదరపు గజం ప్రభుత్వ విలువ రూ.10 వేలు.. బహిరంగ మార్కెట్‌లో రూ.6 వేలు.. ఇకపై ప్రభుత్వ విలువ రూ.12 వేల వరకు పెరుగనుంది.. బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు.. ఇదే పరిస్థితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో తీవ్ర సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై మరో ‘పోటు’ పడనుంది. భూ విలువలు సవరణకు ప్రతిపాదనలు ఖరారు చేసి సగటున 10 శాతం నుంచి 25 శాతం వరకు రేట్లనకు పెంపునకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శుక్ర వారం నుంచి పెంపు ప్రతిపాదనలను సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈనెల 24లోపు రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించి, 27న తుది ప్రతిపాదనలు ఖరారు చేసి జనవరి 1వ తేది నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.
రియల్‌పై మరో పిడుగు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. ప్రధానంగా ఏడు నెలల నుంచి ఓపెన్ ప్లాట్ల నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో పొలాలు ధరలు తిరోగమన బాటపట్టినా కాని కొనుగోలుదారులు ముందుకు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పశ్చిమలో ధరలు బాగా పెరుగుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేశారు. కట్‌చేస్తే.. స్థానికంగా రియల్ మార్కెట్‌పై ప్రజల్లో ఆసక్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఏలూరు జిల్లా పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధానంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పా లకొల్లులో రియల్ మార్కెట్ రెండేళ్ల క్రితం వరకు ఆ శాజనకంగా సాగింది. ఈ ఏడాదిలో మొత్తంగా 140,449 రిజిస్ట్రేషన్లు జరగ్గా 50 శాతానికిపైగా తనఖా, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు కావడమే గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు మరింత ఇబ్బందికరంగా మారనుంది.
పెంపు ప్రతిపాదనలు ఇలా..
ప్రభుత్వం పోటు
భూములు, నిర్మాణాల విలువ పెంపునకు ప్రతిపాదనలు
సగటున 10 నుంచి 25 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగే అవకాశం
మార్కెట్‌లో మందగించిన ఆర్థిక లావాదేవీలు
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు
ఈ నిర్ణయంతో మరో ఎదురుదెబ్బ
మార్కెట్ రేట్లకు సమానంగా రిజిస్ట్రేషన్ విలువలు
ఏలూరు జిల్లా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 12
రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం (2024–25) రూ. 309.65 కోట్లు
ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.214.43 కోట్లు
పూర్తయిన లక్ష్యం 69.25 శాతం
రిజిస్ట్రేషన్ల సంఖ్య 72,268
పశ్చిమగోదావరి జిల్లా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 15
రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం (2024–25) రూ.447.15 కోట్లు
ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.260.92 కోట్లు
పూర్తయిన లక్ష్యం 58.35 శాతం
రిజిస్ట్రేషన్ల సంఖ్య 68,181
ఏలూరు జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అర్బన్, రూరల్‌గా విభజించి ధరలు పెంచారు. భీమడోలు అర్బన్, రూరల్‌లో 15 శాతం, చింతలపూడి అర్బన్, రూరల్‌లో 10 నుంచి 15 శా తం, జంగారెడ్డిగూడెం అర్బన్, రూరల్‌లో 15 శా తం, పోలవరం అర్బన్‌లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం పెంచారు. కా మవరపుకోట అర్బన్‌లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం, వట్లూరు అర్బన్, రూరల్‌లో 15 శాతం, ఏలూరు అర్బన్‌లో 10 శాతం, రూరల్‌లో 10 నుంచి 15 శాతం, గణపవరం అర్బన్, రూరల్‌లో 10 నుంచి 15 శాతం, కై కలూరు అ ర్బన్‌లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం, మండవల్లి, నూజివీడు, ముదినేపల్లి అర్బన్, రూరల్‌లో 10 నుంచి 20 శాతం పెంపుదలను ఆమోదించారు. పశ్చిమగోదావరి జిల్లా ప రిధిలో కార్యాలయాల్లో ధరల పెంపునకు సంబంధించి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలను పరిగణనలోనికి తీసుకుని సర్వే నంబర్ల ఆధారంగా విలువ పెంపు నిర్ధారించాలని సూచించి మూడు రోజుల్లోగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కూడా సగటున 10 నుంచి 25 శాతం పెంపు ప్రతిపాదనలను ప్రాథమికంగా ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment