అధినేతను కలిసిన వడ్డి
తాడేపల్లిగూడెం: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాల గురించి అధినేతతో చర్చించినట్టు రఘురాం చెప్పారు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అధినేత సూచించారన్నారు.
21న పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికకు ఈనెల 21న ఎన్నికలను నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో కమిటీకి సంబంధించి ఒక అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్థులను ఎంపికచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 14 డీసీలు, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 డీ సీలు, ఏలూరు జిల్లా నుంచి 4 డీసీలు మొత్తం 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో డెల్టా ప్రాజెక్ట్ కమిటీని ఎన్నుకుంటామన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం
భీమవరం: జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జూ మ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో చార్జిషీట్ దా ఖలు చేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలన్నారు.
అమిత్‌షా వ్యాఖ్యలపై ఆగ్రహం
భీమవరం: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.బలరామ్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కేవీపీఎస్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన సభ నిర్వహించారు. బలరామ్ మాట్లాడుతూ అమిత్‌షా వ్యాఖ్యలు దారుణమన్నారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు తదితరులు పాల్గొన్నారు.
బర్తరఫ్ చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): పార్లమెంట్‌లో అంబేడ్కర్‌పై వ్యంగ్యంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్‌లో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
భౌగోళిక గుర్తింపునకు కృషి
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కృషి చేస్తోందని వక్తలు అన్నారు. వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన పంటల భౌగోళిక గుర్తింపు, విధానాలు, ప్రక్రియలు అనే అంశంపై గురువారం ఆన్‌లైన్‌లో కార్యక్ర మం ని ర్వహించారు. ఐపీ ఆర్ రిసెల్యూట్ హె డ్ సుభజిత్ సాహా, వీసీ కె.గోపాల్, పరిశోధన సంచా లకులు ఎం.మాధవి తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment