తణుకుకు చెందిన పి.వెంకటేశ్వరరావు విద్యాహక్కు చట్టంలో ఉచిత ప్రవేశం కింద తన కుమార్తెను పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలో 1వ తరగతిలో చేర్పించారు. ఇప్పటివరకు ఫీజు ఊసెత్తని స్కూల్ యాజమాన్యం మొదటి రెండు టర్మ్‌లతో కలిపి ఫీజు మొత్తం రూ.27,000 చెల్లించాలని రెండు రోజుల క్రితం నోటీసు అందించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు.
ఉండి ఎన్‌ఆర్‌పీ అగ్రహారానికి చెందిన రాజా తన కుమారుడిని ఉండిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో సెక్షన్ 12 (1)సీ కింద గతేడాదిలో 1వ తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం 2వ తరగతిలోకి రాగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఈ ఏడాది ఫీజు మొత్తం రూ.23 వేలు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అప్పు చేసి టర్మ్‌ల వారీగా ఫీజు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment