కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Published Fri, Dec 20 2024 12:38 AM | Last Updated on Fri, Dec 20 2024 12:38 AM

కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం

భీమవరం: గ్రామస్థాయిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా జిల్లా నాయకులంతా అండగా ఉంటామని, అధైరపడొద్దని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసా దరాజు భరోసా ఇఇచ్చారు. గురువారం మండలంలోని రాయలం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో 86 శాతం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులే అధికారంలో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కూటమి ప్ర భుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అలుపెరుగని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ పునర్నిర్మాణానికి సమష్టి నిర్ణయాలు తీసుకునేలా పార్టీ అధినేత జగన్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 15 మంది నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేసి కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు నిర్ణ యాలు తీసుకుంటామన్నారు. పార్టీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లారు తప్ప.. కార్యకర్తలు, ఓటర్లు పార్టీకి అండగానే ఉన్నారని స్పష్టం చేశారు. కూటమి పాలనపై ఆరు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యిందన్నా రు. విద్యుత్‌ చార్జీలను పెంచారని, రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలు అటకెక్కించారన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకు ఈనెల 27న విద్యుత్‌ చార్జీల పెంపుపై, జనవరి 3న విద్యార్థుల సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో తరలిరావాలని కో రారు. పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తారన్నారు. డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు పదవుల కంటే గౌరవం కోసం ఆరాటపడతారని దీనిని పార్టీ గుర్తించిందన్నారు. వైఎస్సార్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకువెళదామన్నారు.

భీమవరం మండల అధ్యక్షుడిగా కొండయ్య

భీమవరం మండల పార్టీ అధ్యక్షుడిగా కొత్తపూసలమర్రు సర్పంచ్‌ జల్లా కొండయ్యను ఎంపిక చేసినట్టు ప్రసాదరాజు ప్రకటించారు. మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడిది జాన్సన్‌, జెడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, నాయకులు కామన నాగేశ్వరరావు, బంధన పూర్ణచంద్రరావు, కోడి విజయలక్ష్మి, తి రుమాని ధనుంజయ, గాదిరాజు రామరాజు, బో కూరి విజయరాజు, రవికుమార్‌రాజు, పెనుమాల నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement