ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టాలి
తాడేపల్లిగూడెం రూరల్: కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టాలని, తద్వారా ప్రజావిశ్వాసాన్ని పొందగలమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన జడ్డు హరిబాబు, నాయకులు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికల ముందు జగన్ పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలు తెలిసినా.. కూ టమి నాయకుల మాటలు నమ్మారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన చూసిన ప్రజలు మరలా వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రజల్లో మమేకమై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నాయకులకు సూచించారు. మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్ మాట్లాడారు. వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, నాయకులు వెలిశెట్టి నరేంద్రకుమార్, కంఠమణి సత్యనారాయణ, నక్కా గంగాధర్, తారమట్ల శ్రీనివాస్, ప్రత్తి రంగయ్య, ప్రత్తి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment