కనుకు తీస్తే తట్టి లేపుతుంది
ఆటోమేటిక్ ఇండికేటర్ (స్లీప్ ఇన్ డ్రైవర్) ప్రాజెక్టుతో ఆకివీడు హైస్కూల్ విద్యార్థి కె.మణికంఠ కళ్లజోడు ను రూపొందించాడు. దీనిని పెట్టుకుని వాహనం నడిపినప్పుడు కునుకుతీస్తే వీటిలోని సెన్సార్ అలారం తట్టిలేపుతుంది. బ్యాటరీ, మైక్రో కంట్రోలర్, ఆర్‌ఎఫ్ ట్రాన్స్‌మీటర్, రిలే, లెడ్, ఐఆర్ సెన్సార్ (కన్ను)ను వినియోగించి దీనిని రూపొందించినట్టు మణికంఠ చెప్పాడు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది దోహదపడుతుంది.
పాలీ షెడ్డుతో లాభాలెన్నో..
పాలీ షెడ్డుతో ఫార్మింగ్ ద్వారా నీటి వృథాను ని యంత్రివచ్చని వివరిస్తూ తణుకు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు తయారు చేశారు. పాలీ షెడ్డును ఉపయోగించి సాగు చేయడం ద్వారా అధికోత్పత్తిని సాధించవ చ్చని వివరించారు.
వ్యర్థాలతో ఇంధనం
వ్యర్థాలను వినియోగించి ఇంధనం తయారుచేసే విధానాన్ని వివరిస్తూ అత్తిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వర్కింగ్ మోడల్‌ను తయారుచేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మండించి దాని నుంచి వచ్చే గ్యాస్‌ను కండెన్సేషన్ ద్వారా ద్రవరూపంలో మార్చడం ద్వారా ఇంధనం తయారీ గురించి వివరించారు.
అగ్నిప్రమాదాలు నివారించేలా..
ఉండి జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఫైర్ అలారం అండ్ ఎక్సాస్టింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెన్సార్ ద్వారా అలారం మోగి ఆటోమేటిక్‌గా వాటర్ మోటార్ ఆన్ కావడం, ప్రమాద స్థలంలో వాటర్ స్ప్రేయింగ్ గురించి వివరించారు.
బోట్ నావిగేషన్ సిస్టమ్
వీరవాసరం హైస్కూల్ విద్యార్థులు బోట్ మిస్సింగ్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బోట్‌కు నావిగేషన్ సిస్టమ్‌ను అమర్చి సెల్‌ఫోన్‌కు అనుసంధానించడం ద్వారా నీట మునిగిన, జాడ తెలియకున్న బోటును ఎస్‌ఎంఎస్ రూపంలో గు ర్తించే వీలుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment