అక్కిరెడ్డిగూడెంలో చైన్ స్నాచింగ్
దెందులూరు: అక్కిరెడ్డిగూడెంలో చైన్‌స్నాచింగ్ కేసు నమోదైంది. దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలివి. అక్కిరెడ్డిగూడెంకు చెందిన మహిళ మంగళవారం ఉదయం బయట నుంచి ఇంటికి వస్తుండగా మోటారుసైకిల్‌పై ఒక వ్యక్తి వచ్చి ఆమె మెడలో మూడున్నర కాసుల బంగారం గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ చెప్పారు.
రాళ్లకుంటలో కేబుల్ వైర్ల చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంటలో సోమవారం అర్ధరాత్రి 10 మందికి పైగా రైతుల వ్యవసాయ భూముల్లో బోర్లు మోటార్లకు ఉన్న విద్యుత్ కేబుళ్లను కట్‌చేసి, చోరీ చేశారు. మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఇది గుర్తించి లబోదిబోమంటున్నారు. అలాగే గ్రామ పంచాయతీకి చెందిన మంచినీటి బోరు మోటారు కేబుల్ సైతం చోరీకి గురి కావడంతో, ఉదయం పంచాయతీ అధికారులు కొత్త కేబుల్ వైర్లను అమర్చి, ప్రజలకు తాగునీటిని సరఫరా చేశారు. ఇదిలా ఉంటే చోరీకి పాల్పడిన వ్యక్తులు విద్యుత్ ఫ్యూజ్ క్యారియర్‌లను ధ్వంసం చేశారు. ఒక్కో ఫ్యూజ్ క్యారియర్ విలువ రూ.4 వేలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. కేబుల్ వైర్ల దొంగలు కారణంగా తమకు కంటిమీద కునుకు ఉండటం లేదని, పొలాలు, తోటల్లోని విద్యుత్ కేబుల్ వైర్లను ఎలా కాపలా కాసుకోవాలో అర్ధం కావడంలేదని వాపోతున్నారు. కేబుల్ వైర్లు దొంగలిస్తున్న కేటుగాళ్లను పోలీసులు పట్టుకుని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment