శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మద్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణ మంగళవారం ఉదయం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ డీఈఓ బాబురావు స్వామి వారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు.
ఎస్సీ కులగణనపై అభ్యంతరాలు
భీమవరం: ఎస్సీ కులగణనలో అభ్యంతరాలున్నాయని వాటిని పరిశీలించి ఎస్సీ కుల సర్టిఫికెట్స్ జారీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గరికిముక్కు సుబ్బయ్య వినతిపత్రం అందజేశారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎస్సీ కుల సర్టిఫికెట్ పొందుతున్నారని రాజ్యాంగం ప్రకారం ఇది చెల్లదన్నారు. కుల సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో ఎస్సీ హిందూ అని రాయడంతో పాటు వారి ఉపకులాన్ని కూడా పొందుపర్చాలని కోరుతున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాడుగుల దుర్గాప్రసాద్, అడపా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment