కానిస్టేబుల్ అభ్యర్థులపరుగు పోటీలో అపశ్రుతి
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో చేపడుతున్న కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు నిర్వహిస్తున్న 1600 మీటర్ల పరుగు పోటీలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పోటీలో ఓ అభ్యర్థి కాలు ఆకస్మికంగా కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు అతడ్ని ఏలూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. పరుగు పోటీల్లో నిర్ణీత సమయానికి లక్ష్యాన్ని చేరుకుంటేనే అర్హత సాధించే అవకాశం ఉండడంతో బ్యాచ్ నెంబర్ 12లో ఏలూరు లంకపేట ప్రాంతానికి చెందిన ఎం.చంద్రశేఖర్ అనే అభ్యర్థి వేగంగా పరుగుపెడుతూ కాలు విరగటంతో కుప్పకూలిపోయాడు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో చంద్రశేఖర్‌ను ఏలూరు సర్వజన అసుపత్రికి తరలించారు. పరుగు పోటీలను పర్యవేక్షిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెంటనే స్పందిస్తూ సర్వజన ఆసుపత్రికి వెళ్లి బాధితుడ్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈనెల 9వ తేదీన కానిస్టేబుల్ దేహధారుఢ్య పరీక్షలు ఆఖరి రోజు అని, ఇప్పటి వరకూ హాజరుకాని ఎవరైనా అభ్యర్థులు ఈ పోటీలకు హాజరుకావచ్చని ఎస్పీ కేపీ శివకిషోర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment