మూన్నాళ్ల ముచ్చటే!
● మరమ్మతులు.. సర్కారు కుప్పిగుంతలు
సాక్షి, భీమవరం: రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి చేతులెత్తేసిన కూటమి సర్కారు కనీస మరమ్మతుల్లోనూ కుప్పిగంతులు వేస్తోంది. ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమత్తుల నిమిత్తం జిల్లాకు రూ. 42.57 కోట్లు మంజూరు చేసింది. స్టేట్ హైవే(ఎస్‌హెచ్) రోడ్లలో రూ.10.45 కోట్ల విలువైన 41 పనులు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల(ఎండీఆర్)లో రూ.32.12 కోట్లు విలువైన 140 పనులు ఉన్నాయి. వీటిలో తణకు–భీమవరం, చేబ్రోలు–ఉండి, కాళీపట్నం–భీమవరం, భీమవరం–గుడివాడ తదితర 50కు పైగా రోడ్లలో 698 కిలోమీటర్లు మేర మరమ్మతులు చేయాల్సి ఉంది.
నాసిరకంగా పనులు
సంక్రాంతి నాటికి రోడ్లపై ఎక్కడా గుంతలన్నవే లేకుండా చేస్తామని ప్రకటించగా ఇంతవరకు రూ.18 కోట్ల విలువైన 40 శాతం మేర పూర్తయ్యాయి. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా చేస్తుండటంతో గుంతలు పూడ్చిన కొద్దిరోజులకే రాళ్లు పైకిలేచిపోయి ప్రమాదభరితంగా తయారవుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలకు దేశ, విదేశాల నుంచి బంధుమిత్రులు తరలివస్తుంటారు. వారి దృష్టిని ఆకర్షించేందుకు మూడు రోజుల పాటు మన్నితే చాలన్నట్టుగా రోడ్ల మరమ్మతులు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల వారీగా వివరాలు
నియోజకవర్గం మొత్తం కిలోమీటర్లు మంజూరు మొత్తం
పనులు (రూ.కోట్లలో)
భీమవరం 29 77.42 8.61
ఉండి 39 151.88 12.25
పాలకొల్లు 18 73.59 3.64
ఆచంట 25 97.38 3.33
నియోజకవర్గం మొత్తం కిలోమీటర్లు మంజూరు మొత్తం
పనులు (రూ.కోట్లలో)
తాడేపల్లిగూడెం 29 142 6.9
నరసాపురం 15 55 2.97
తణుకు 14 56.8 2.35
ఉంగుటూరు 12 43.9 2.52
జిల్లాలో గుంతలు పూడ్చేందుకు రూ.42.57 కోట్ల మంజూరు
ఇంతవరకు రూ.18 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి
సంక్రాంతికి వచ్చే వారికి రోడ్లు బాగుచేశామని చెప్పుకునే ప్రయత్నం
పండుగ మూడు రోజులు మన్నితే చాలన్నట్లు పనులు
వారం పదిరోజులకే పైకిలేస్తున్న రాళ్లు, బూడిద
Comments
Please login to add a commentAdd a comment