ఏపీ టీం కంటింజెంట్ చీఫ్‌గా వెంకట్రామయ్య
ఏలూరు రూరల్: జాతీయ క్రీడల కోసం ఆంధ్రప్రదేశ్ టీమ్ కంటింజెంట్ చీఫ్ డి మిషన్‌గా బడేటి వెంకట్రామయ్య నియామకమయ్యారని ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి టి దినేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 9 నగరాల్లో 35వ జాతీయ క్రీడలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 14, 15 తేదీల్లో డెహ్రడూన్‌లో ప్రత్యేక సమావేశం జరగనుందని వివరించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ టీమ్ కంటింజెంట్ చీఫ్ ది మిషన్‌గా నియమితులైన వెంకట్రామయ్య హాజరుకానున్నట్లు తెలిపారు. జాతీయ పోటీల్లో మొత్తంగా 21 క్రీడాంశాల్లో రాష్ట్ర జట్లు పాల్గొననున్నాయి. ఒక్కొక్క క్రీడాంశానికి చీప్ డి మిషన్‌గా నియమిస్తారు. ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా, 2011లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ డిప్యూటి కాంపిటేషన్ మేనేజర్‌గా సేవలు అందించిన బడేటిని మరోసారి డి మిషన్‌గా నియమించారని పేర్కొన్నారు.
వాయు త్రిలింగ క్షేత్రంలోప్రత్యేక పూజలు
పాలకొల్లు అర్బన్: వాయుత్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శివదేవుని చిక్కాలలోని శ్రీపార్వతీ సమేత శ్రీశివదేవ స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఆలయ ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. ఆలయ ఈవో కేవీ సాగర్, అర్చకస్వామి ర్యాలి సతీష్ భక్తులకు సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment