మట్టపల్లిలో వసంతసేవ నిర్వహిస్తున్న అర్చకులు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం బ్రహ్మశ్రీ బొర్రా వాసుదేవాచార్యులు పర్యవేక్షణలో శ్రీస్వామివారికి శాస్త్రోక్తంగా వసంతసేవ, చక్రతీర్థము, హోమపూర్ణాహుతి గావించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి సుప్రభాతసేవ, ద్రవిడప్రబంధసేవా కాలం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మి అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి దోపోత్సవం(తిరుమంగయాళ్వారాదుల చరి త్ర పఠనం) ధ్వజావరోహణము, మౌనబలి, చేపట్టారు. కాగా స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై శ్రీజయమన్నార్ అలంకారంలో ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరిరోజైన సోమవారం శ్రీరంగనాయకస్వామి అలంకారంలో శృంగారడోలోత్సవం(పవళింపుసేవ), భక్తిసంగీతవిభా వరి, అశీర్వచనము, తీర్థప్రసాదాల వినియోగం ఉంటాయని అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ తెలిపారు. వేడుకల్లో పాలకమండలి సభ్యులు, వెంకటనారాయణ, రామయ్య, కామేశ్వరమ్మ, ఫణికుమార్, అర్చకులు రామాచార్యులు, శ్రీని వాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, హరికిరణాచార్యులు, వంశీక్రిష్ణమాచార్యులు, బజ్జూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో కొనసాగుతున్న ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment