అంగన్‌వాడీల్లో 312 ఖాళీలు
భువనగిరిటౌన్ : అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం పంపిణీ చేయడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లతో పాటు పదవీ విరమణ పొందిన వారు, ఈ ఏడాది పదవీ విరమణ పొందనున్న సిబ్బంది వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది. ఈమేరకు మేరకు ఐసీడీఎస్ అధికారులు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను గుర్తించి సంబంధిత శాఖకు పంపించారు.
ఖాళీలు ఇలా..
జిల్లాలో భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూరు నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా టీచర్లు 843, ఆయాలు 647 మంది పనిచేస్తున్నారు. ఖాళీ పోస్టుల్లో టీచర్లు 58, ఆయా పోస్టులు 254 ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ ప్రకారంగానే ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన
ఐసీడీఎస్ అధికారులు
ఫ త్వరలో భర్తీకి సన్నాహాలు
ఫ పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా నియామకాలు
ఆదేశాలు రాగానే భర్తీ చేస్తాం
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కేవలం పౌష్టికాహారం పంపిణీయే కాకుండా పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్ల ఖాళీలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపించాం. పదవీ విరమణ పొందిన వివరాలు సైతం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఖాళీలను భర్తీ చేస్తాం.
– నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment