నిలదీతలు, నిరసనలు, వాగ్వాదాలు
సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్న ఈ సభలో అధికారులు లబ్ధిదారుల జాబితా చదువుతుండగా పేర్లు లేనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ఆస్తులు లేవని, అయినా తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని అధికారులను నిలదీశారు. కలెక్టర్ కలగజేసుకుని రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని, ప్రస్తుతం రూపొందించింది ముసాయిదా జాబితా మాత్రమేనని నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి జయశ్రీ, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ఏఓ వర్షితారెడ్డి, ఏపీఓ ప్రశాంతి, ఎంపీఎం యాదయ్య పాల్గొన్నారు. తదితరలున్నారు.
మోటకొండూరులో రోడ్డుపై బైఠాయించిన దరఖాస్తుదారులు
మోటకొండూర్: మండల కేంద్రం మోటకొండూరుతో పాటు మార్టూరు సభల్లో గ్రామస్తులు, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. జాబితా తయారీలో అవకతవకలు జరిగాయని, అనర్హులను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటకొండూరులో రోడ్డుపై బైఠాయించారు. జాబతా మళ్లీ రూపొందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు.
గ్రామసభలోనే జాబితా తయారు చేయాలి
ఆత్మకూరు(ఎం): మండలంలోని కొరటికల్‌లో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామసభలోనే లబ్ధిదారుల జాబితా తయారు చేయాలంటూ జాబితాలో పేర్లు రానివారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజారాం, ఎంపీడీఓ రాములునాయక్, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.
ఫ రసాభాసగా గ్రామసభలు
ఫ లబ్ధిదారుల జాబితాలపై అభ్యంతరాలు
Comments
Please login to add a commentAdd a comment