హెల్మెట్ ధారణతో ప్రాణాలకు రక్షణ
ఆలేరురూరల్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలకు రక్షణ ఉంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ రూపొందించిన ‘హెల్మెట్ ధారణ–ప్రాణానికి రక్షణ’ బ్రోచర్‌ను గురువారం ఆలేరు పట్టణంలో జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ) సాయికృష్ణ, ఏసీపీ రమేష్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, అతివేగం అనర్ధదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ శ్యాంప్రసాద్, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్, హర్షవర్ధన్, సీఐ కొండల్‌రావు, ఎస్‌ఐ రజినీకర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Comments
Please login to add a commentAdd a comment