బొమ్మలరామారం: కోతుల భయంతో ఓ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకింది. ఈ ఘటన బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాలు.. బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన భార్గవి స్థానికంగా ఉన్న మాతృశ్రీ హైస్కూల్‌లో 10వ తరగతి చదవుతోంది. రోజు మాదిగా సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన భార్గవి పాఠశాల మొదటి అంతస్తులో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కోతుల గుంపు విద్యార్థులు పైకి వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన భార్గవి పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలపాలైన భార్గవిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిని సంప్రదించగా.. విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకిన ఘటన తమ దృష్టికి రాలేదన్నారు.
తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment