15 ఏళ్ల నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల నిరీక్షణకు తెర

Published Fri, Sep 27 2024 1:28 AM | Last Updated on Fri, Sep 27 2024 1:12 PM

15 ఏళ్ల నిరీక్షణకు తెర

సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా డీఎస్సీ–2008 అభ్యర్థులు

కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని ప్రభుత్వ నిర్ణయం

ఉమ్మడి జిల్లాలో 391 మంది అభ్యర్థులకు లబ్ధి

నేటినుంచి నల్లగొండలో సర్టిఫికెట్ల పరిశీలన

భువనగిరి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ–2008లో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీ)గా నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 391మంది అభ్యర్థులు ప్రయోజనం పొందనున్నారు. నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో శుక్రవారం నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు..

2008 డిసెంబర్‌ 6వ తేదీన నాటి ప్రభుత్వం 35వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో 30 శాతం ఎస్జీటీ పోస్టులను డీఈడీ చేసిన వారికి ప్రత్యేకంగా కేటాయించారు. దీంతో బీఈడీ అభ్యర్థులు మార్కులపరంగా ముందునప్పటికీ నష్టపోయారు. అప్పటి నుంచి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తూ కోర్టులను సైతం అశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టులు తీర్పును సైతం ఇచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభ్యర్థులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చెల్లించనున్నారు.

ఎంపిక ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 391 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 100 నుంచి 115 మంది ఇతర ఉద్యోగాల్లో చేరారు. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న సర్టిఫికెట్‌ల పరిశీలనకు 250 నుంచి 260 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్‌ పత్రాన్ని విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. దానిని పూర్తిగా నింపి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసేందుకు అంగీకరిస్తున్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అంగీకార పత్రాన్ని సర్టిఫికెట్‌ల పరిశీలన సమయంలో అధికారులకు అందజేయాలి.

సమయానికి హాజరుకావాలి

నల్లగొండ డీఈఓ కార్యాలయంలో శుక్రవారం నుంచి సర్టిఫికెట్‌ల పరిశీలన జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం.అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరుకావాలి.

–భిక్షపతి, డీఈఓ, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement