రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
భువనగిరి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు కే.జెండగే పేర్కొన్నారు. బుధవారం భువనగిరిలోజరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. రక్తదాన శిబిరాల నిర్వహణలో భువనగిరి శాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. రెడ్‌క్రాస్ ద్వారా విస్త్రతంగా సేవలందించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ ప్రొఫెసర్ రాములు, అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment