కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భువనగిరిటౌన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు లో పేరుకుపోయిన క్లయిమ్లను పూర్తి చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ పాషా, జహంగీర్, తూటి వెంకటేశం వంగాల మారయ్య, జుంపాల మహేష్, రాసాల రమేష్, ఎస్కే శ్రీను, కృష్ణ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment