సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published Wed, Nov 6 2024 1:57 AM | Last Updated on Wed, Nov 6 2024 1:57 AM

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రామన్నపేట: రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావులతో కలిసి రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం(తుమ్మలగూడెం) చెరువులో విడుదల చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవన కార్యక్రమంతో ప్రజల జీవన స్థితిగతులు, ఆరోగ్యం, పర్యావరణం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రాజేష్‌చంద్ర, మత్స్యశాఖ జిల్లా అధికారి రాజారాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు పూస బాలకిషన్‌, పున్న రమేష్‌, జినుకల ప్రభాకర్‌, గంగుల వెంకటరాజిరెడ్డి, పుంటికూర శంకరయ్య, పెద్దగోని వెంకటేశం, గర్దాసు సురేష్‌, మందడి గోపాల్‌రెడ్డి, నాగు ఆంజనేయులు, పబ్బు రమేష్‌, రాధారపు మహేష్‌, పబ్బు మచ్చేందర్‌, మల్లేశం, నరేష్‌, ధనుష్‌, విక్కి, నర్సింహ, వినోద్‌, సాయి, బాలకృష్ణ, సందీప్‌ పాల్గొన్నారు.

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement