కల్లాల్లో రైతుల ధాన్యం కొనేదిక్కులేదు
సాక్షి, యాదాద్రి: కల్లాల్లో రైతుల ధాన్యం కొనేదిక్కులేదని, నెల రోజులుగా రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దమనకాండతో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కేటీఆర్ బావమరిది గృహప్రవేశం చేసుకుంటే రేవంత్ రెడ్డి విషం చిమ్మాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్రలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పే మాటలకు చేతలకు పొంతలేదన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ఓం ప్రకాష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్
Comments
Please login to add a commentAdd a comment