దుబ్బాకలో అధికారుల విచారణ
రామన్నపేట: రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల నిధులను వీఓఏ లింగస్వామి తన సొంత అవసరాలకు వాడుకోవడంతో మంగళవారం ఐకేపీ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించారు. మొత్తం 11 సంఘాల సభ్యులకు సంబంధించి రూ 19.20లక్షలను వీఓఏ వాడుకున్నట్లు, ఇప్పటికే రూ 10.50లక్షలు సభ్యుల ఖాతాల్లో జమ చేసినట్లు తేలిందని అధికారులు తెలిపారు. మిగిలిన సంఘాలకు సంబంధించిన అకౌంట్లను పరిశీలించడం జరుగుతుందని, వాడుకున్న డబ్బులను వారం రోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు వీఓఏ లింగస్వామి రాత పూర్వకంగా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. విచారణలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు రాంప్రసాద్, ఆనంద్, యాదయ్య, డీఎంజీ బాలరాజు, వివిధ మండలాల సీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment