64 మందికి నో ఎంట్రీ
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం నిర్వహించిన గ్రూప్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 6,043 మందికి గాను 3,098(51.26శాతం) మంది హాజరయ్యారు. 2,945 మంది గైర్హాజరయ్యారు. పేపర్–2కు 6,043 మంది అభ్యర్థులకు 3,094(51.19) మంది పరీక్ష రాశారు. 2,949 మంది గైర్హాజరయ్యారు.
అరగంట ముందే కేంద్రాల గేట్లు మూసివేత
నిర్దేశిత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడం వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించలేదు. శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల, జాగృతి డిగ్రీ కళాశాల, మదర్ థెరిస్సా స్కూల్, వెన్నెల కళాశాల, వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల, యూనిటీ ఫార్మసీ కళాశాల, దివ్యబాల విద్యాలయంతో పాటు మరికొన్ని కేంద్రాలకు 64 మంది అభ్యర్థులు అలస్యంగా రావడంతో అధికారులు వారికి అనుమతి నిరాకరించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అభ్యర్థి
సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన శృతి అనే అభ్యర్థి పరీక్ష రాయడానికి వస్తుండగా అనాజిపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో చికిత్స తీసుకుని భువనగిరిలోని వెన్నెల కళాశాలకు వెళ్లే సరికి అలస్యమైంది. కారణం చెప్పినా అధికారులు ఆమెను పరీక్ష కేంద్రంలోని అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు.
నేడు పేపర్–3
పేపర్–3 పరీక్ష సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది. అభ్యర్థులు నిర్దేశిత సమయానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషలం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు సూచించారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు
భువనగిరిలోని వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేపర్–2 కూడా ప్రశాంతంగా ముగి సేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కృషి ఐటీఐలోని కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, వెన్నెల కళాశాల సెంటర్‌ను అదనపు కలెక్టర్ గంగాధర్ సందర్శించారు. వీరితో పాటు గ్రూప్–3 పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ, ఇతర అధికారు లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆలస్యంగా రావడంతో పరీక్ష
కేంద్రాల్లోకి అనుమతి నిరాకరణ
మొదటి రోజు ప్రశాంతంగా గ్రూప్–3
51 శాతం మంది హాజరు
Comments
Please login to add a commentAdd a comment