ప్రైవేట్‌కు రిఫర్ చేయొద్దు
భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చిన రోగులను పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. అత్యవసర వార్డులో బెడ్ షీట్స్, పిల్లో కవర్లు శుభ్రంగా లేకపోవడంతో శానిటేషన్ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ల రికార్డులు, మూత్రశాల, ల్యాబ్, మైత్రి టాన్స్‌జెండర్ క్లినిక్, నవజాత శిశువు చికిత్స కేంద్రం, డయాలసిస్, ఈఎన్‌టీ వార్డు, ప్రసూతి విభాగం, వయో వృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రం, స్కానింగ్ సెంటర్, చిన్న పిల్లల వార్డును పరిశీలించారు. వీల్ చైర్స్ లేవని ఆయన దృష్టికి తీసుకురావడంతో టీజీఎంఐడీసీతో ఫోన్‌లో మాట్లాడి ఆరు వీల్ చైర్స్‌ను పంపాలని కోరారు. అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు రక్తాన్ని పరీక్షించకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకోమని ప్రోత్సహించడంతో పాటు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ల్యాబ్ టెక్నీషియన్ ఎండీ యూనిస్ అలీను సస్పెండ్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పూర్తి ఎక్యూర్‌మెంట్స్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురాతన భవనం కావడంతో అక్కడక్కడా లీకేజీ ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ చిన్ననాయక్, ఆర్‌ఎంఓ శ్రీనివాస్, డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వచ్చే నెల 7 వరకు ప్రజాపాలన కళాయాత్ర
భువనగిరిటౌన్: ప్రజా పాలన విజయోత్సవాలు 2024లో భాగంగా ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ హనుమంత రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ంసదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన కళాయాత్రకు సమాచార, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. వచ్చేనెల 7వ తేదీ వరకు జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక కళాకారులు ప్రచారం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి, అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన
కలెక్టర్ హనుమంతరావు
ఫ రక్త పరీక్ష కోసం ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment