పేదలకు సేవలు అందించాలి
సాక్షి,యాదాద్రి: ప్రభుత్వ ఉద్యోగులు పేదలకు సేవలు అందించాలని ఎండోమెంట్ కమిషనర్ టూరిజం డైరెక్టర్ హనుమంతు కే.జెండగే అన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తనకు సహకరించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఎండోమెంట్ కమిషనర్, టూరిజం డైరెక్టర్గా బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆయనకు మంగళవారం కలెక్టరేట్లో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. పనితీరులో సమర్థుడు, సౌమ్యుడిగా హనుమంతు కె.జెండగే పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, సీఈఓ, శోభారాణి, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, రామిరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎండోమెంట్ కమిషనర్
హనుమంతు కె.జెండగే
Comments
Please login to add a commentAdd a comment