నిలిచిన పొడి వస్తువుల సేకరణ
భువనగిరి: పొడి వస్తువుల సేకరణకు మహిళా సంఘాల సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో గత నెల రోజులుగా సేకరణ నిలిచిపోయింది. మెప్మా పరిధిలో ఉన్న మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో పొడి వస్తువుల సేకరణ కేంద్రం (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నిర్వహణను మహిళా సంఘాల్లోని పేద మహిళలకు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన పొడి వస్తువులను ఈ కేంద్రంలో విక్రయించుకునే అవకాశం ఉంది. నిర్వాహకులు వారి నుంచి సేకరించిన పొడి వస్తువులను ఇతర వ్యాపారులకు విక్రయించి ఉపాధి పొందేవారు.
ముందుకు రాని మహిళలు..
భువనగిరి మున్సిపాలిటీలో నిత్యం సుమారు 22 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి పారిశుద్య కార్మికులు డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ క్రమంలో సీసాలు, ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్ అట్టలు సేకరించి పొడి వస్తువుల సేకరణ కేంద్రంలో విక్రయిస్తారు. కొన్ని సందర్భాల్లో సేకరించిన ధరకు, విక్రయించిన ధరకు తేడా ఉండటంతో నిర్వాహకులకు నష్టం వస్తుంది. దీంతో నెల రోజులుగా మహిళా సంఘాల సభ్యులు కేంద్రం నిర్వహణకు ముందుకు రావడం లేదు.
ఫ అలంకారప్రాయంగా సేకరణ కేంద్రం
ఫ నిర్వహణకు ముందుకు రాని
మహిళా సంఘాల సభ్యులు
ఈ వారంలో కేంద్రం నిర్వహణ ప్రారంభమవుతుంది
పొడి వస్తువుల సేకరణ కేంద్రం నిర్వహణకు ఇప్పటికే మెప్మా సిబ్బందితో మాట్లాడాం. స్వయం సహాయక సంఘాల నుంచి ముందుకు వచ్చిన మహిళలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ వారంలో కేంద్రం నిర్వహణ ప్రారంభమవుతుంది.
– రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment