వరి విత్తనాలు సరిపడా ఉన్నాయి
భువనగిరిటౌన్: యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన దుకాణ డీలర్లు వారి వద్ద ఉన్న విత్తనాల వివరాలను స్టాక్ బోర్డులపై ప్రదర్శించాలని, విత్తనాలను మద్దతు ధర కంటే ఎక్కువగా అమ్మొద్దని, విక్రయించిన విత్తనాలకు సరైన బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలు పాటించని విత్తన దుకాణ డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని, విత్తన లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆంజనేయ స్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయం, విష్ణుపుష్కరిణి వద్ద, పాత గుట్ట ఆలయంలో ఆంజనేయ స్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూవులకు నిత్యపూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. నిజాభిషేకం, తులసీదళాలతో అర్చనలు చేసి, భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి జోడు సేవ, రాత్రి శయనోత్సవం నిర్వహించి ద్వార బంధనం చేశారు.
మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం
చౌటుప్పల్: చౌటుప్పల్‌లో నిర్వహించనున్న జిల్లా మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లా ఏర్పడినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. అందులో భాగంగా 15న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో కొండమడుగు నర్సింహ, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, పల్లె మధుకృష్ణ, రాగీరు కిష్టయ్య, బాలయ్య, సంజీవరెడ్డి, సబిత, నంధీశ్వర్, శ్రీనివాస్, వెంకటేశం, శ్రీను, దేవేందర్‌రెడ్డి, వసంత, లక్ష్మయ్య పాల్గొన్నారు.
చెరువులపై ప్రత్యేక
దృష్టి సారించాం
యాదగిరిగుట్ట రూరల్: గోదావరి జలాలతో చెరువులు నిండుతుండడంతో నియోజకవర్గంలోని చెరువులపై ప్రత్యేక దృష్టి సారించామని డిస్ట్రిక్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు, వంగపల్లి తదితర గ్రామాల్లో కట్టు కాలువలు, ఫీడర్ చానల్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీళ్లు చెరువులోకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట ఈఈ ఖుర్షిద్ పాషా, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సైదాపురం మాజీ ఉప సర్పంచ్ దుంబాల వెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, బాలకృష్ణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment