నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలే..
భువనగిరి : చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం యాదా ద్రి జిల్లాలో కనిష్ట 19, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా జలులు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో వచ్చే వ్యాధులు
● జ్వరం, శరీరంపై దద్దుర్లు రావచ్చు.
● దగ్గు, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి.
● చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్లోటోజోవన్ల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
● గాలిద్వారా సూక్ష్మ జీవులు శరీరంలో ప్రవేశించి తెల్ల రక్తకణాలను నిర్వీర్యం చేయడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
● పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధికి గురై ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
● చిన్న పిల్లలకు స్వెటర్లు, చెవులకు టోపీ, కాళ్లు, చేతులకు సాక్సులు, గ్లౌజ్‌లు వేయాలి.
● నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ఉదయం ఎండలో ఉంచాలి.
● చిన్నారులతో ఉదయం ప్రయాణాలు చేయొద్దు.
● పిల్లలకు అవసరమైన టీకాలు ఇప్పించాలి.
● రాత్రి వేళల్లో చల్లగాలి రాకుండా ఇంట్లో కిటికిలు తలుపులు మూసి వేసి వెచ్చదనం కోసం వేడినిచ్చే హైవోల్టేజీ బల్బులను వేయాలి.
పెరిగిన చలి తీవ్రత
వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రతలు తప్పనిసరంటున్న వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment