రైతులకు రూ.130 కోట్లు చెల్లించాం
భూదాన్‌పోచంపల్లి: జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.130 కోట్లు చెల్లించామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నిల్వ ఉన్న ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లారీలు, గన్నీబ్యాగుల కొరత లేకుండా చూశామని, వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేశామని, మిల్లర్లు కూడా ధాన్యం దిగుమతి చేసుకోవడానికి సహకరిస్తున్నారన్నారు. మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, జిల్లాలో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాటికి 69శాతం కుటుంబ సమగ్ర సర్వే పూర్తయ్యిందని కలెక్టర్ తెలిపారు. మిగతా సర్వేకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు
మెడికల్ సీట్లకు మంగళవారం చివరితేది
కాగా జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎనస్తేషియా, ఎక్స్‌రే కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం వరకు చివరి గడువు ఉందని కలెక్టర్ తెలిపారు. 25 సీట్లు ఖాళీ ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హులైన వారు మెడికల్ కాలేజీ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎంపీఓ మాజిద్, ఏఎస్‌ఓ శ్రావణి, పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
కలెక్టర్ హనుమంత రావు
Comments
Please login to add a commentAdd a comment