సంస్థాన్ నారాయణపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు. సోమవారం సంస్థాన్ నారాయణపురంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కారక్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26న గ్రామగ్రామాన వంద వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, బచ్చనగోని గాలయ్య, కె.శ్రీనివాస్, కలకొండ సంజీవ, వీరమళ్ల యాదయ్య, మంచాల జంగయ్య, పల్లె మల్లారెడ్డి, సుర్వి నర్సింహ, కొప్పు సుధాకర్, నర్సింహ్మ, గాలయ్య, మల్లయ్య, యాదగిరి, నర్సింహ, శ్రీను, మోత్యా, లచ్చు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment