రైతుభరోసా ఏమాయే!
అప్పు తీసుకువచ్చాం
పంట సాగుకు పైసలు లేక పెట్టుబడి కోసం బయటి వ్యక్తుల దగ్గర వడ్డీకి అప్పులు తెచ్చా. పంట సాగు మొదలయ్యే సమయంలోనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికై నా మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే పెట్టుబడి సాయాన్ని అందించాలి.
– వట్టిపల్లి మొగులి మల్లయ్య, బహద్దూర్‌పేట
ఇప్పటివరకు అందించలేదు
వానాకాలం పంటల సాగు సంబంధించి కోతలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఇంకా ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా తెలియదు. పెట్టుబడి సాయం అనేది పంట పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడేలా ఉండాలి. – గంగుల శ్రీనివాస్, ఆలేరు
ఆలేరురూరల్: పంట సాగుకు అయ్యే పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులకు గురికావొద్దనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. రెండు సీజన్‌లకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున చెల్లించింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ఇప్పటికే రైతులు అప్పులు తెచ్చి పంట సాగు చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది కానీ ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 2,71,590 మంది రైతులు
జిల్లాలో 421 గ్రామాల పరిధిలో పెట్టుబడి సాయం అందించేందుకు వ్యవసాయాధికారులు 2,49,206 మంది రైతులను గుర్తించారు. గత యాసంగిలో పంట రుణాలకు సంబంధించి ట్రెజరీకి అప్పగించారు. ప్రభుత్వం రూ.293 కోట్ల 68 లక్షలను రైతుల ఖాతాలో జమ చేశారు. వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచి అ యితే సీజన్ ముగింపు దశకు చేరుకున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించినా పెట్టుబడి సాయం కింద ఒక్కపైసా విడుదల చేయలేదు.
ఫ పంటల సాగుకు అప్పులు తెచ్చి
పెట్టుబడి పెట్టిన రైతులు
ఫ కోతలు పూర్తయినా ఇప్పటివరకు సాయం అందించని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment